
Mamata Shankar: కళారంగ సేవలకు గుర్తింపు.. నృత్య కళాకారిణి మమతా శంకర్‌కు పద్మశ్రీ
ఈ వార్తాకథనం ఏంటి
మమతా శంకర్... ప్రముఖ సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్ మేనకోడలు.గొప్ప నృత్యకారులైన ఉదయ్ శంకర్,అమలా శంకర్‌ల కుమార్తె. కళాకారుల కుటుంబంలో పుట్టడంతో,ఆమె బాల్యం నృత్యం,సంగీతం,నాటకాలతో గడిచింది. తల్లిదండ్రుల వారసత్వాన్ని అందుకున్న మమతా శంకర్ చిన్నతనంలోనే నాట్యంలో అరంగేట్రం చేశారు. తన ప్రతిభతో పాటు అందంతోనూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ బెంగాలీ చిత్రం'మృగయా'లో నటించే అవకాశాన్ని ఆమెకు కల్పించారు. ఆ సినిమాలో తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆ తర్వాత సత్యజిత్ రే దృష్టిని ఆకర్షించి 'ఘనశత్రు' అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి బుద్ధదేవ్ దాస్ గుప్తా,గౌతమ్ ఘోష్,రితుపర్ణో ఘోష్ వంటి ప్రఖ్యాత బెంగాలీ దర్శకుల సినిమాల్లో ఆమె నటిగా ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.
వివరాలు
తెలుగు సినిమాలో మృణాల్ సేన్
ఇదిలా ఉంటే, మమతా శంకర్ ఉదయన్ మమతా శంకర్ డ్యాన్స్ కంపెనీ, మమతా శంకర్ బ్యాలే ట్రూప్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అనేక నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ ప్రత్యేకతలే మమతకు పద్మశ్రీ దక్కేలా చేశాయి. మమతా శంకర్ కేవలం నృత్యకళాకారిణి మాత్రమే కాకుండా కొన్ని చిత్రాల్లో నటించారన్న విషయం చాలా మందికి తెలియదు. తెలుగులో మృణాల్ సేన్ రూపొందించిన 'ఒక ఊరి కథ' (1977) చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆ చిత్రంలో కథానాయకుడిగా సీనియర్ నటుడు నారాయణరావు ఉన్నారు. కమర్షియల్ చిత్రాల్లో కాకుండా వాస్తవిక సినిమాల్లోనే నటించిన మమత, ఆ తర్వాత తన జీవితాన్ని నృత్యానికి అంకితం చేశారు. ప్రస్తుతం 70 ఏళ్ల మమతా శంకర్ కోల్‌కతాలో తన కుమారుడి దగ్గర నివసిస్తున్నారు.