Manchu Lakshmi: వివాదంలో మంచు లక్ష్మీ.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా కేసు నమోదు?
ఈ వార్తాకథనం ఏంటి
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తీవ్ర చిక్కుల్లో పడ్డారు.
ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11 మంది సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. తాజా వివాదంలో హీరోయిన్, నటి మంచు లక్ష్మి కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.
మంచు లక్ష్మిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే, ఆమె బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు, పలు పెద్ద సినిమాల టీజర్, ట్రైలర్ రిలీజ్‌లలో ఓపెనింగ్ కార్డులోనే ఈ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
Details
కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పై కూడా పోలీసుల దృష్టి
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో ఒక కానిస్టేబుల్ కూడా ఇరుక్కోవడం సంచలనంగా మారింది. కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని, ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు.
చాపకింద నీరులా విస్తరిస్తున్న బెట్టింగ్ మాఫియా ఏకంగా కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ చేత టెలిగ్రామ్ చానెల్‌లో బెట్టింగ్ టిప్స్ ఇచ్చి, పోలీసు యూనిఫామ్‌లోనే ప్రమోషన్ చేశాడని పోలీసులు గుర్తించారు.
హబీబ్‌నగర్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఆయన పాత్రపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో పాల్గొన్న ఇంకా మరెన్ని పేర్లు బయటకు వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.