NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కరాటే కళ్యాణికి షాక్: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదంపై నోటీసులు జారీ చేసిన మంచు విష్ణు 
    తదుపరి వార్తా కథనం
    కరాటే కళ్యాణికి షాక్: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదంపై నోటీసులు జారీ చేసిన మంచు విష్ణు 
    కరాటే కళ్యాణికి మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసులు

    కరాటే కళ్యాణికి షాక్: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదంపై నోటీసులు జారీ చేసిన మంచు విష్ణు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 17, 2023
    03:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినీ నటి కరాటే కళ్యాణీకి షాక్ తగిలింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో వివాదం చెలరేగుతుండడంతో మంచు విష్ణు నోటీసులు పంపించారని తెలుస్తోంది.

    ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ దగ్గర 54అడుగుల శ్రీకృష్ణుడి ఆకారంలోని సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా కరాటే కళ్యాణి మాట్లాడింది.

    శ్రీకృష్ణుడి ఆకారంలోని సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సరైన చర్య కాదని, శ్రీకృష్ణుడిగా ఒక మనిషిని ఆరాధించడం తమ మనోభావాలను దెబ్బతీయడమేనని అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షురాలిగా ఆమె అభ్యంతరం తెలియజేసింది.

    దీంతో మా సభ్యురాలిగా క్రమశిక్షణను ఉల్లంఘించిందని మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసులు జారీ చేసారు.

    Details

    విగ్రహావిష్కరణ ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ 

    ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటు విషయంలో ఆమె మాట్లాడిన మాటలు అనుచితంగా ఉన్నాయని, క్రమశిక్షణకు విరుద్ధంగా ఉన్నాయని, అందువల్లే షోకాజ్ నోటీసులు పంపినట్లు అర్థమవుతోంది.

    ఈ నోటీసులకు మూడు రోజుల్లో స్పందించాలని నోటీసులోని సారాంశం. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    కృష్ణుడి ఆకారంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ని గౌరవ అతిథిగా ఆహ్వానించారని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    తెలుగు సినిమా

    విజయ్ దేవరకొండ కార్ లవ్: విజయ్ గ్యారేజీలో ఉన్న ఈ కార్ల గురించి తెలుసా?  విజయ్ దేవరకొండ
    విజయ్ దేవరకొండ ఫిలిమ్ ఫేర్ అవార్డును ఎందుకు వేలం వేసాడో తెలుసా?  విజయ్ దేవరకొండ
    ఫిదా సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలియజేసిన సాయి పల్లవి  సినిమా
    ఖుషి ఫస్ట్ సింగిల్: మణిరత్నం సినిమా రిఫరెన్సులతో శివ నిర్వాణ సాహిత్యం అదరహో  విజయ్ దేవరకొండ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025