Loading...
Chiranjeevi: మెగాస్టార్ 'కాకా' డబ్బింగ్ షురూ.. సంక్రాంతి రిలీజ్‌కు రెడీ!
మెగాస్టార్ 'కాకా' డబ్బింగ్ షురూ.. సంక్రాంతి రిలీజ్‌కు రెడీ!

Chiranjeevi: మెగాస్టార్ 'కాకా' డబ్బింగ్ షురూ.. సంక్రాంతి రిలీజ్‌కు రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2026
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా' నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించింది. దీంతో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి 'కదిరి కాళిదాస్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అనశ్వర రాజన్, నివేతా పేతురాజ్, కన్నడ నటి రచిత రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్, గెటప్ శ్రీను ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

వివరాలు

సినిమా విడుదలపై అభిమానుల్లో ఉత్సాహం

ప్రస్తుతం డబ్బింగ్ పనులను ప్రారంభించిన చిత్రబృందం.. మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉంది.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభం కావడంతో సినిమా విడుదలపై అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

ADVERTISEMENT