
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: మహిళల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్న అనుష్క
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళతో దూసుకుపోతుంది.
ఈ సినిమా విడుదలకు ముందు నుండి ప్రమోషన్లలో నవీన్ పోలిశెట్టి మాత్రమే కనిపించారు. తాజాగా అనుష్క శెట్టి ప్రమోషన్లలో జాయిన్ అయ్యారు.
అవును, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను రూపొందించిన అనుష్క, మహిళల కోసం బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మహిళల కోసం సెప్టెంబర్ 14వ తేదీన ప్రత్యేక షోస్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 18 ప్రాంతాల్లో 19స్పెషల్ షోస్ వేయనున్నామని అనుష్క తెలియజేసారు.
Details
ప్రత్యేక షోస్ ప్రదర్శితమయ్యే ప్రాంతాలు
తెలంగాణ
కూకట్ పల్లి - విశ్వనాథ్
వరంగల్ - జెమినీ కాంప్లెక్స్
ఖమ్మం- సాయిరాం
నల్గొండ- ఎస్ వి సి నటరాజ్
మహబూబ్ నగర్- ఏవిడి తిరుమల
ఆదిలాబాద్- నటరాజ్ డీలక్స్
నిజామాబాద్- లలితా మహల్
ఆంధ్రప్రదేశ్
కర్నూల్- ఆనంద్ కాంప్లెక్స్
కడప- రాజా
అనంతపూర్- త్రివేణి కాంప్లెక్స్
తిరుపతి- ఎస్ వి సినీ ప్లెక్స్
ఏలూరు- బాలాజీ ఏసి
గుంటూరు- భాస్కర్ సినిమాస్
విశాఖపట్నం- మెలోడీ
అమలాపురం- విపిసి కాంప్లెక్స్
కాకినాడ- పద్మప్రియ
విజయవాడ- శైలజ
నెల్లూరు- లీలామహల్.
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేశారు.