తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Mohan Babu: మోహన్‌బాబుకు చికిత్స పూర్తి.. గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్
                వ్రాసిన వారు
                Jayachandra Akuri
            
            
                            
                                    Dec 12, 2024 
                    
                     04:00 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ప్రముఖ నటుడు మోహన్‌బాబు గురువారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన నివాసంలో జరిగిన ఘర్షణ అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్య పరీక్షల తరువాత కంటి దిగువ భాగంలో గాయమైందని వైద్యులు తెలిపారు. మోహన్‌బాబుకు బీపీ ఎక్కువగా ఉందని, గుండె కొట్టుకోవడంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయని కూడా వైద్యులు గుర్తించారు.
Details
ఈ నెల 24 వరకు విచారణపై స్టే
రెండ్రోజుల చికిత్స తరువాత, ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయ్యారు. తన నివాసంలో జరిగిన ఘర్షణపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబుకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ నెల 24 వరకు విచారణపై స్టే ఇచ్చింది.