
Nagababu : తల్లి ఆరోగ్యం బాగానే ఉంది.. రూమర్లపై నాగబాబు రియాక్షన్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు వార్తలు వ్యాప్తి చెందగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేబినెట్ మధ్యలోనే హైదరాబాద్ తిరిగి వస్తున్నారంటూ, చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్స్ రద్దు చేసుకున్నారంటూ పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ రూమర్లపై నాగబాబు స్పందించారు. 'మా తల్లి ఆరోగ్యం చాలా బాగుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని ఖండించారు.
Details
నెగిటివ్ గా రాయొద్దు
ఈ రోజు ఉదయం నుంచి అంజనాదేవి ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు రావడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అవేవీ నిజం కాదని తేలింది. గతంలోనూ ఇలాంటి రూమర్లు పలు సార్లు వచ్చాయి. రెండు, మూడు సార్లు స్వయంగా చిరంజీవే స్పందిస్తూ తల్లి ఆరోగ్యంపై ఇలా రాయొద్దు అని వేడుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే ఉపాసన కూడా అంజనాదేవితో చేసిన వంటల వీడియోని షేర్ చేయడంతో ఆమె ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్టు తేలింది.