Natural star Nani: 800సినిమా ఆఫర్ ను వద్దనుకున్న నాని: కారణం వెల్లడి చేసిన నిర్మాత
శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ నేపథ్యంలో '800' పేరుతో సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800వికెట్లు తీసిన ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్ రికార్డులకు ఎక్కాడు. ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందిన 800మూవీ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్రలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించాడు. నిజానికి మొదటగా ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తాడని అన్నారు. ఆ సమయంలో విజయ్ సేతుపతి కి సంబంధించిన టైటిల్ పోస్టర్లు కూడా బయటకు వచ్చాయి.
నాని వద్దకు 800 మూవీ కథ
కానీ నిరసనల నేపథ్యంలో 800సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నారు. అయితే 800సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించడానికి తెలుగు హీరో నేచురల్ స్టార్ నానిని కూడా సంప్రదించారట. ఈ మేరకు 800మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెల్లడి చేశారు. 800మూవీ కథను నేచురల్ నేచురల్ స్టార్ నాని విన్నారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో క్రికెట్ నేపథ్యంలో తాను నటించిన జెర్సీ సినిమా రిలీజై కేవలం సంవత్సరం మాత్రమే అయ్యిందని, అందువల్ల 800మూవీలో నటించలేక పోయారనీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెల్లడి చేశారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన 800మూవీ అక్టోబర్ 6వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది.