
విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేయనున్న డీజే టిల్లు భామ
ఈ వార్తాకథనం ఏంటి
డీజే టిల్లు సినిమాతో పేరు తెచ్చుకున్న నేహా శెట్టి, ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. డీజె టిల్లు సినిమాలో తన గ్లామర్ తో యువత మతి పోగొట్టిన నేహా శెట్టి, బెదురులంక 2012చిత్రంతో ఉగాది రోజున ప్రేక్షకులను పలకరించనుంది.
అయితే ఆ సినిమా విడుదల కాగానే, మరో సినిమాను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా కొత్త సినిమాను మొదలు పెట్టబోతుందని వినిపిస్తోంది.
క్రిష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఇందులో హీరోయిన్ గా నేహాశెట్టి అయితే బాగుంటుందని, ఆమెని తీసుకుంటున్నారట. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
తెలుగు సినిమా
శర్వానంద్ బిజీగా ఉండడంతో, విశ్వక్ సేన్ కి అందిన ఆఫర్
నిజానికి విశ్వక్ సేన్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం, శర్వానంద్ తో రూపొందాల్సింది. కానీ శర్వానంద్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో, విశ్వక్ సేన్ చేతికి చిక్కింది.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు, అందులో నేహాశెట్టి సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట.
ఇదిలా ఉంటే, దాస్ కా ధమ్కీ సినిమాతో ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
ఈ సినిమాలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించిన ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను విశ్వక్ సేన్ తన మీదే వేసుకున్నాడు.