దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్: విశ్వక్ సేన్ సినికాకు ఆస్కార్ క్రేజ్
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. మార్చ్ 22వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి పెరిగింది.
దానికి ప్రత్యేక కారణం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడం ఒక కారణమైతే, ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చాక, తొలిసారిగా పబ్లిక్ మీటింగ్ కి ఎన్టీఆర్ రావడం రెండవ కారణం.
ఆస్కార్ గురించి ఎన్టీఆర్ ఏం మాట్లాడతారు? అమెరికాలో ఆస్కార్ వేడుక ఎలా జరిగిందీ? తెలుగు సినిమాకు అమెరికాలో దక్కిన గౌరవం గురించి ఎన్టీఆర్ ఏమంటారని అందరూ ఎదురుచూస్తున్నారు.
అందుకే అందరి చూపు ఇప్పుడు దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద పడింది.
దాస్ కా ధమ్కీ
ఒక్కసారిగా దాస్ కా ధమ్కీ చిత్రానికి పెరుగుతున్న ఆదరణ
నిజానికి దాస్ కా ధమ్కీ చిత్రం, ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా వేస్తున్నామని చెప్పారు కానీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రకటించలేదు.
తీరా సడెన్ గా మార్చ్ 22వ తేదీన దాస్ కా ధమ్కీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్ టైమ్ ఎక్కువ లేదని చాలామంది అభిప్రాయ పడ్డారు.
కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తుండడంతో, అందరి నోళ్లలోనూ ఈ సినిమా నానుతోంది. ఈ ఒక్క ఈవెంట్ తో ధమ్కీ సినిమా గురించి అందరికీ తెలిసిపోతుందని అంటున్నారు.
హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో, మార్చ్ 17న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.