Ravi Teja -Vivek : రవితేజ-వివేక్ ఆత్రేయ సినిమాకు కొత్త నిర్మాత.. దిల్ రాజు పాత స్నేహితుడే!
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా 'రవితేజ' వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' విడుదలకు సిద్ధమవుతుండగానే.. మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో రవితేజ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఫిలింనగర్ వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
వివరాలు
ప్రాజెక్ట్ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ ఔట్?
రవితేజ-వివేక్ ఆత్రేయ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది.
దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను మరో నిర్మాత తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
రంగంలోకి కొత్త నిర్మాత?
దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి గతంలో విడిపోయిన లక్ష్మణ్.. ఇప్పుడు రవితేజ-వివేక్ ఆత్రేయ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో లక్ష్మణ్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నిర్మాణ సంస్థ మార్పుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
వచ్చే ఏడాది సెట్స్‌పైకి..
మరోవైపు దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను జెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోందట.
రవితేజ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ కథను పవర్‌ఫుల్, స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
కథ, యాక్షన్, టేకింగ్ విషయంలో తనదైన శైలిని చూపించే వివేక్ ఆత్రేయ.. రవితేజ మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించనున్నట్లు టాక్.
వివరాలు
త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం
వివేక్ ఆత్రేయ స్టైలిష్ టేకింగ్‌కు రవితేజ మాస్ ఇమేజ్ తోడైతే ఈ కాంబినేషన్‌లో భారీ బ్లాక్‌బస్టర్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా లక్ష్మణ్ పేరు అధికారికంగా ఖరారవుతుందా? మైత్రీ మూవీ మేకర్స్ ఎందుకు తప్పుకుంది? అనే విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.