
RRR: 'ఆర్‌ఆర్‌ఆర్' లైవ్ కాన్సర్ట్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఫోటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా 'ఆర్ఆర్‌ఆర్' మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేసింది.
గతంలో ఆస్కార్ అందుకున్న 'నాటు నాటు' పాటతో ప్రపంచ మన్నన పొందిన ఈ చిత్రం, తాజాగా లండన్‌లో మరో ఘనతను సాధించింది.
రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఘనంగా జరిగిన 'ఆర్ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్' అందరినీ ఆకట్టుకుంది.
రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మంత్రముగ్దుడిని చేసేలా సంగీత ప్రదర్శన చేశారు.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ జన్మదినం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ముందుగానే శుభాకాంక్షలు తెలిపాడు.
Details
ఆనందంలో ఫ్యాన్స్
ఈ దృశ్యాలు అక్కడి అభిమానులను ఉర్రూతలూగించాయి. వారిద్దరిని ఒకే వేదికపై చూసిన ప్రేక్షకులు ఆనందంతో కేకలు వేశారు. ఈ ముగ్గురి ఫొటోలు సోషల్‌మీడియాలో వేగంగా వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం రాజమౌళి, మహేశ్‌బాబు కలిసి భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం (#SSMB29) మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికపై లైవ్ కాన్సర్ట్ నిర్వహించిన మొదటి విదేశీ చిత్రం 'బాహుబలి 2'. ఇప్పుడు అదే దర్శకుడి చిత్రం 'ఆర్ఆర్‌ఆర్' కూడా ఆ ఘనతను సాధించడం విశేషం.