Page Loader
రజనీకాంత్ 170: జై భీమ్ దర్శకుడితో సినిమా మొదలు
రజనీకాంత్ 170వ మూవీ ప్రకటన వచ్చేసింది

రజనీకాంత్ 170: జై భీమ్ దర్శకుడితో సినిమా మొదలు

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 02, 2023
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరో రజనీకాంత్ 170వ మూవీ ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతానికి తలైవర్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది. అనిరుధ్ రవించందర్ ఈ సినిమాను సంగీతం అందించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ చైర్మ లైకా సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా, తలైవర్ 170వ చిత్రాన్ని ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవనుందని సమాచారం. తలైవర్ 170వ చిత్రాన్ని 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట. అదలా ఉంచితే రజనీకాంత్ నటించిన 169వ మూవీ జైలర్, 2023 ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రజనీకాంత్ 170వ మూవీ ప్రకటన