స్వీట్ కారం కాఫీ ట్రైలర్: ముగ్గురు మహిళల జీవిత కథ
ఓటీటీలోకి రోజూ కొత్త కొత్త కంటెంట్ వస్తోంది. వేరు వేరు జోనర్లలో రకరకాల సిరీస్ లు, సినిమాలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సరికొత్త సిరీస్ రాబోతుంది. స్వీట్ కారం కాఫీ టైటిల్ తో తెరకెక్కిన ఈ సిరీస్, ట్రైలర్ ఈరోజే విడుదలైంది. వేరు వేరు వయస్సు గల ముగ్గురు మహిళల కథను స్వీట్ కారం కాఫీ సిరీస్ లో చూపించబోతున్నారు. ఒకే ఇంట్లో ఉండే ముగ్గురు వేరు వేరు జెనరేషన్ కు చెందిన మహిళలు, ఆ ఇంట్లో తమని సరిగా చూసుకోవడం లేదని, తమని చులకనగా చూస్తున్నారని, గుర్తింపు ఉండటం లేదని బాధపడతారు. ఆ బాధలోనే రోడ్ ట్రిప్ ఆలోచన వస్తుంది. వెంటనే అందరూ కలిసి రోడ్ ట్రిప్ వెళ్ళిపోతారు.
జులై 6నుండి స్ట్రీమింగ్
రోడ్ ట్రిప్ లో తమని తాము అన్వేషించుకుంటారు. కొత్తవాళ్లతో మాటలు, పరిచయాలు, మొదలైనవన్నీ వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయనేది సిరీస్ లో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సిరీస్ లో జాతీయ ఉత్తమ నటి లక్ష్మి, మధుబాల, శాంతి బాలచంద్రన్ ముగ్గురు మహిళలుగా కనిపించారు. ఇతర పాత్రల్లో బాల సురేష్, దేవ్, అయేషా గులియా కపూర్, వివేక్ రాజగోపాల్ నటిస్తున్నారు. బిజోయ్ నంబియార్, కృష్ణ మరిముత్తు, స్వాతి రఘురామన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, జులై 6వ తేదీ నుండి తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.