ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఛాయ్ బిస్కట్, లహరి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన మేమ్ ఫేమస్ సినిమాకు రిలీజ్ కు ముందు మంచి బజ్ ఏర్పడింది. మహేష్ బాబు ట్వీట్ చేయడంతో ఆ బజ్ బాగా పెరిగింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన మేమ్ ఫేమస్, మంచి హిట్ అవుతుందని అందరూ ఊహించారు. కానీ అనుకోకుండా మేమ్ ఫేమ్స్ చిత్రం, థియేటర్ల వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఈరోజు నుండి చూడవచ్చు.
మేమ్ ఫేమస్ కథ ఏంటంటే?
బండనర్సింపల్లి అనే పల్లెటూరిలో అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు ఫ్రెండ్స్, మహేష్(సుమంత్ ప్రభాస్), బాలకృష్ణ(మౌర్య చౌదర్య), దుర్గ(మణి ఏగుర్ల) లైఫ్ ని లైట్ గా తీసుకుని గడిపేస్తుంటారు. ఈ ముగ్గురి వల్ల ఊర్లో వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుంది. ఊర్లో అందరూ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని తిడుతూనే ఉంటారు. ఆ తిట్లతో విసిగిపోయి ఎలాగైనా సరే ఫేమస్ అవ్వాలనుకుంటారు. ఫేమస్ అవడం కోసం ఏం చేసారనేదే సినిమా కథ. ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రల్లో, శివ నందన్, అంజిమామ, కిరణ్ మచ్చా నటించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు.