Loading...
OTTplay Awards 2025: 'పంచాయత్ 3'కు ఉత్తమ సిరీస్ అవార్డు.. మనోజ్ బాజ్‌పాయ్‌కు ఉత్తమ నటుడు గౌరవం
'పంచాయత్ 3'కు ఉత్తమ సిరీస్ అవార్డు.. మనోజ్ బాజ్‌పాయ్‌కు ఉత్తమ నటుడు గౌరవం

OTTplay Awards 2025: 'పంచాయత్ 3'కు ఉత్తమ సిరీస్ అవార్డు.. మనోజ్ బాజ్‌పాయ్‌కు ఉత్తమ నటుడు గౌరవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

నేటి వినోద ప్రపంచంలో ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ సినిమాలకు సమానంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. వినూత్న కథలు, కథాంశాలతో వెబ్‌సిరీస్‌లు, చిత్రాలను తెరకెక్కించి దర్శకులు, నటులు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ వినియోగదారులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించే 'ఓటీటీప్లే' తమ వార్షిక అవార్డ్స్‌ను ప్రదానం చేసింది. 'వన్ నేషన్.. వన్ అవార్డ్' పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో వివిధ భాషల్లోని అత్యుత్తమ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు, నటీనటులకు పురస్కారాలు లభించాయి. తాజాగా 'ఓటీటీప్లే అవార్డ్స్ 2025' మూడో ఎడిషన్ అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ భాషల్లో ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌లు, సినిమాలు పలు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకున్నాయి. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలు, నటులు, దర్శకులు తమ ప్రతిభకు తగ్గట్టుగా గుర్తింపు దక్కించుకున్నారు.

Details

ఓటిటి చిత్రాలకు దక్కిన అవార్డులివే!

ఉత్తమ చిత్రం: గర్ల్స్‌ విల్‌ బి గర్ల్స్‌ (అలీ ఫజల్‌ అండ్‌ రిచా చద్దా)

ఉత్తమ దర్శకుడు (ఫిల్మ్‌): ఇంతియాజ్‌ అలీ (అమర్‌ సింగ్‌ చంకీలా)

ఉత్తమ నటుడు (పాపులర్‌): మనోజ్‌ బాజ్‌పాయ్‌ (డిస్పాచ్‌)

ఉత్తమ హాస్యనటి : ప్రియమణి (భామాకలాపం2)

ఉత్తమ నటనా ప్రతిభ: అవినాష్‌ తివారి (ది మెహతా బాయ్స్‌)

ఉత్తమ నటనా ప్రతిభ: షాలినీ పాండే (మహరాజ్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అనుపమ్ ఖేర్‌ (విజయ్‌69, ది సిగ్నేచర్‌)

ఉత్తమ నటి (పాపులర్‌): కాజోల్‌ (దోపత్తి)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): పార్వతి తిరువొత్తు (మనోరథంగళ్‌)

ఉత్తమ విలన్‌: సన్నీ కౌశల్‌ (ఫిర్‌ ఆయే హసీనా దిల్‌రుబా)

Details

వెబ్‌సిరీస్‌లలో సత్తా చాటింది వీరే!

ఉత్తమ వెబ్‌సిరీస్‌ : పంచాయత్‌3

ఉత్తమ దర్శకుడు: నిఖిల్‌ అడ్వాణీ (ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌ నైట్‌)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జైదీప్‌ అహ్లవత్‌ (పాతాళ్‌లోక్‌2)

ఉత్తమ నటి (పాపులర్‌): అదితి రావ్‌ హైదరి (హీరామండి)

ఉత్తమ సహాయ నటుడు : రాహుల్‌ భట్‌ (బ్లాక్‌ వారెంట్‌)

ఉత్తమ నటుడు (పాపులర్‌): రాఘవ్‌ జ్యుయెల్‌ (గయారా గయారా)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): నిమేషా సజయన్‌ (పోచర్‌)

ఉత్తమ నటనా ప్రతిభ: అభిషేక్‌ కుమార్‌ (తలైవేట్టయాన్‌ పాలయం)

ఉత్తమ నటనా ప్రతిభ: పత్రలేఖ (ఐసీ 814)

ఉత్తమ సహాయ నటి: జ్యోతిక (డబ్బా కార్టెల్‌)

ఉత్తమ హాస్య నటుడు: నీరజ్‌ మాధవ్‌ (లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌)

ADVERTISEMENT

Details

ఓటిటి స్పెషల్ అవార్డ్స్‌ ఇవే

ఉత్తమ టాక్‌ షో వ్యాఖ్యాత: రానా దగ్గుబాటి (ది రానా టాక్‌ షో)

ఉత్తమ రియాల్టీ షో : ది ఫ్యాబులస్‌ లైవ్స్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ వైవ్స్‌

ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్‌: ది రోషన్స్‌

ప్రామిసింగ్‌ నటుడు: అపరశక్తి ఖురానా (బెర్లిన్‌)

రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌: అవనీత్‌ కౌర్‌ (పార్టీ టిల్‌ ఐ డై)

ట్రయల్‌ బ్లేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: దివ్య దత్‌ (శర్మజీ కా బేటి, బండిష్‌ బండిట్స్‌2)

పయనీర్‌ కంట్రిబ్యూషన్స్‌ టు న్యూ వేవ్‌ సినిమా: అశ్విన్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌

ప్రామిసింగ్‌ నటి: హినా ఖాన్‌ (గృహలక్ష్మి)

ఉత్తమ పరిచయ వెబ్‌సిరీస్‌ నటి: వేదిక (యక్షిణి)

ADVERTISEMENT