
Pindam Movie Review: 'పిండం' మూవీ రివ్యూ.. ప్రేక్షకుల్ని అలరించిందా?
ఈ వార్తాకథనం ఏంటి
చాన్నళ్ల తర్వాత 'పిండం' సినిమా ద్వారా శ్రీరామ్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
హార్రర్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత నిర్మించిన ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుంది.
అన్నమ్మ(ఈశ్వరీరావు) తన తండ్రి ద్వారా వచ్చిన తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తుంది.
ఇది తెలుసుకొని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్‌నాథ్ (అవసరాల శ్రీనివాస్) అన్నమ్మ వద్దకు వెళుతాడు.
ఆ క్రమంలో 1990ల నాటి ఓ ఘటన గురించి అన్నమ్మ చెబుతుంది.
Details
పిండం
పురాతన ఇల్లును కొనుగోలు చేసి ఇంట్లోకి వెళ్లిన తర్వాత అంటోని ఫ్యామిలీకి ఉహించని సంఘటనలు ఎదురవుతాయి.
అలాంటి సమయంలో అన్నమ్మ రంగంలోకి దిగుతుంది. అన్నమ్మ ఆ దుష్ట శక్తుల నుంచి కాపాడిందా? చివరికి ఏం జరిగిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా భయం భయంగా సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది.
ప్లాష్ బ్యాక్ రిలీవ్ చేసినప్పుడు సినిమా మీద ఆసక్తి తగ్గుతుంది.
సెకండ్ హాఫ్ మరింత వర్క్ చేసి ఉంటే రిజర్ట్ వేరే లెవెల్లో ఉండేంది. ఇందులో భయపట్టే సన్నివేశాలు బాగున్నాయి.
ఇక ఈ మూవీకి సంగీతం అదనపు ప్లస్‌గా మారింది.
ఇందులో భావోద్వేగాలు కొరవడంతో సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. ఎట్టేకేలకు ఈ మూవీ అక్కడక్కడా భయపెడుతుంది.