PrabhasDp : ఏడేళ్ల తర్వాత ప్రభాస్ డీపీ చేంజ్.. 'ఫౌజీ' లుక్‌తో నెట్టింట రచ్చ!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం సహజమే. తాజాగా ఆయన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చడంతో మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచారు. ప్రభాస్ డీపీ మార్చడం వెనుక పెద్దగా ఎలాంటి ప్రకటన లేకపోయినా.. అభిమానుల్లో మాత్రం భారీ సందడి నెలకొంది. ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఒకే ప్రొఫైల్ పిక్చర్‌ను కొనసాగిస్తూ వచ్చారు. తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లి పాన్ ఇండియా స్టార్‌డమ్ అందించిన 'బాహుబలి'లోని ఓ ఫొటోను ఆయన సుమారు ఏడేళ్లుగా డీపీగా పెట్టుకున్నారు.
వివరాలు
'ఫౌజీ' లుక్ ను షేర్ చేసిన ప్రభాస్
తన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, అప్‌డేట్లు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నప్పటికీ.. ప్రొఫైల్ పిక్చర్‌ను మాత్రం మార్చలేదు.
అలాంటిది చాలా కాలం తర్వాత.. దాదాపు ఏడేళ్లకు 'ఫౌజీ'లోని తన లుక్‌కు సంబంధించిన ఫొటోను డీపీగా పెట్టడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ప్రభాస్ డీపీ మార్చిన కొద్ది నిమిషాల్లోనే అభిమానులు, సినీ ప్రేమికులు ఆ ఫొటోను సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో '#PrabhasDP' హ్యాష్‌ట్యాగ్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో టాప్ ట్రెండ్స్‌లోకి దూసుకెళ్లింది.
వివరాలు
డిసెంబర్ 2న మూవీ రిలీజ్
ఏదేమైనా.. ప్రభాస్ కేవలం తన ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చడం ద్వారా కూడా ఓ సినిమా అప్‌డేట్ వచ్చినంత హంగామా సృష్టించారు.
'ఫౌజీ'పై అభిమానుల్లో ఉన్న ఆసక్తికి ఈ డీపీ మార్పు మరింత ఊపునిచ్చింది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రీమియర్లతో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.