
Prabhas :ప్రభాస్ డబ్బింగ్ షురూ.. 'ది రాజా సాబ్' షూటింగ్ తుది దశలో!
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ది రాజా సాబ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.
రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వీటికి ప్రధాన కారణం - ప్రభాస్‌ను చాలా కాలం తర్వాత కామెడీ జోనర్‌లో చూడబోతుండడమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Details
ప్రత్యేకంగా డబ్బింగ్ సెట్
వచ్చే వారం నుంచి ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా, ప్రభాస్‌కు ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్‌ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ బిజీ షెడ్యూల్ మధ్యలో ఇంకా కొన్ని డేట్స్ కేటాయిస్తే, షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే అవకాశముందని టాక్.
దీంతో 'ది రాజా సాబ్' త్వరలోనే విడుదలకు సిద్దమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుందనేది ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరి, మీరు ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నరు?