
ప్రభాస్ అభిమానులకు పండగలాంటి వార్త: సలార్ ట్రైలర్ వచ్చేది ఆరోజే?
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా గురించి అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలోకి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే సలార్ ట్రైలర్ రిలీజ్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు సలార్ సినిమా నుండి టీజర్ మాత్రమే విడుదలైంది.
అందులో కూడా ప్రభాస్ ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయలేదు. కేవలం టీను ఆనంద్ డైలాగ్ ఎలివేషన్లతోనే సరిపుచ్చారు.
అందుకే ప్రభాస్ అభిమానులంతా సలార్ ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ట్రైలర్ రిలీజ్ తేదీపై ఒకానొక వార్త హల్ చల్ చేస్తోంది.
Details
సెప్టంబర్ 3న సలార్ ట్రైలర్ రిలీజ్?
సలార్ ట్రైలర్ సెప్టెంబర్ 3వ తేదీన విడుదల కానుందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. రిలీజ్ కు 25 రోజుల ముందుగా ట్రైలర్ ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే మరికొద్ది రోజుల్లో సలార్ ట్రైలర్ విడుదల కాబోతుందన్నమాట. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
రెండు భాగాలుగా విడుదలవుతున్నసలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టీనూ ఆనంద్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.