Page Loader
Raja saab : గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటులో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్
గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటులో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్

Raja saab : గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటులో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'రాజా సాబ్' నుంచి స్టైలిష్ పోస్టర్ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2024
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

Details

ఏప్రిల్ 10న 'రాజా సాబ్' రిలీజ్

ఈ సినిమా 2024 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇదిలా ఉంటే, ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 కావడంతో, చిత్రబృందం ఆయన అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమైంది. పుట్టినరోజుకు ముందే, ప్రభాస్ ప్రత్యేక లుక్‌తో ఉన్న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. గళ్ల చొక్కా, నల్ల ఫ్యాంటు, టీషర్ట్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్ ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ బర్త్‌డే రోజు సినిమా టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇది అభిమానులకు మరో మేజర్ ట్రీట్ కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్