కామిక్ వెర్షన్ లో ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ కె స్టోరీ: వింత లోకాన్ని పరిచయం చేసిన మేకర్స్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా టీమ్ అంతా అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో కామిక్ వెర్షన్ లో ప్రాజెక్ట్ కె కథను మేకర్స్ వెల్లడి చేసారు. చిత్రబృందం రివీల్ చేసిన రెండు పోస్టర్లు కామిక్ వెర్షన్ లోని ప్రాజెక్ట్ కె కథను తెలుపుతున్నాయి. హీరోలందరూ అంతరించిపోయిన కలియుగంలో ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రాక్షస సేన, జనాలను ఇబ్బంది పెడుతూ, మా నాయకుడికి మొక్కాలని చెబుతాయి. జనాలు మాత్రం, చావనైనా చస్తాం కానీ అలా చెయ్యమని అంటారు. దాంతో ఆ జనాలను రాక్షసులు చంపేస్తారు. ఆ టైమ్ లో సూపర్ హీరో వచ్చినట్లుగా రెండవ పోస్టర్ లో చూపించారు.
వింత లోకాన్ని పరిచయం చేస్తున్న కామిక్ వెర్షన్
ఈ కామిక్ వెర్షన్ కు సంబంధించిన కథ ఇంకా ఉందని, ఈవెంట్ లో పూర్తిగా వెల్లడి చేస్తామని ప్రాజెక్ట్ కె టీమ్ వెల్లడి చేసింది. కామిక్ వెర్షన్ లోని కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే ఏదో వింతలోకంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్ళేలా కనిపిస్తోంది. గ్లింప్స్ రిలీజైతే ఈ విషయం మీద మరింత క్లారిటీ వస్తుంది. కామిక్ కాన్ ఈవెంట్లో హాల్ హెచ్ లో ప్రాజెక్ట్ కె గ్లింప్స్, టైటిల్ విడుదల కానున్నాయి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.