ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి
ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్ళాలని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి ఇద్దరూ అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా స్క్రీనింగ్స్ లో వీళ్ళిద్దరూ పాల్గొంటున్నారు. తాజాగా డైరెక్టర్స్ గిల్డ్ కి వేసిన స్క్రీనింగ్ లో ఇద్దరూ పాల్గొన్నారు. ఇక్కడ రాజమౌళి ఆసక్తికర విషయాన్ని వెల్లడి చేసాడు. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ గురించి అనేక కథనాలు వస్తున్నాయి. మొదట్లో రాజమౌళి ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. కానీ అమెరికాలో వస్తున్న ఆదరణ చూసి సీక్వెల్ ఉంటుందని, నాన్న విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు.
స్క్రిప్ట్ లాక్ అయ్యిందని చెప్పిన రాజమౌళి
ప్రస్తుతం డైరెక్టర్స్ గిల్డ్ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో మాట్లాడుతూ, స్క్రిప్ట్ లాక్ అయ్యిందని, దాని తాళం చెవిని ఇప్పుడే అందరికీ ఇవ్వలేనని చెప్పుకొచ్చారు. దీంతో అందరూ కన్ఫ్యూజన్ లో పడిపోయారు. తన నెక్స్ట్ సినిమా గురించి రాజమౌళి మాట్లాడాడు. ఆ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి రాజమౌళి మాట్లాడారా? లేదా మహేష్ బాబు తో చేస్తున్న సినిమా గురించి మాట్లాడారా అన్నది అర్థం కావట్లేదు. ఏది ఏమైనా స్క్రిప్ట్ లాక్ అయ్యింది కాబట్టి రాజమౌళి నుండి కొంచెం తొందరగానే సినిమాను ఎక్స్ పెక్ట్ చేయొచ్చని అనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. మహేష్ బాబు తో చేసే సినిమాకు కూడా సీక్వెల్స్ ఉంటాయని తెలిసిందే.