NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆర్ఆర్ఆర్: హాలీవుడ్ దిగ్గజాల సరసన రామ్ చరణ్, ఆ పార్టీకి ఇండియా నుండి ఒకే ఒక్కడు
    తదుపరి వార్తా కథనం
    ఆర్ఆర్ఆర్: హాలీవుడ్ దిగ్గజాల సరసన రామ్ చరణ్, ఆ పార్టీకి ఇండియా నుండి ఒకే ఒక్కడు
    లూయిస్ విట్టన్ మ్యాగజైన్ పార్టీకి హాజరైన రామ్ చరణ్

    ఆర్ఆర్ఆర్: హాలీవుడ్ దిగ్గజాల సరసన రామ్ చరణ్, ఆ పార్టీకి ఇండియా నుండి ఒకే ఒక్కడు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 09, 2023
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ, పశ్చిమ దేశాల సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అవార్డ్ సీజన్ లో దుమ్ము దులుపుతోంది ఆర్ఆర్ఆర్.

    ఇప్పటికే న్యూయార్క్ ఫిలిమ్ సర్కిల్ క్రిటిక్స్ ఛాయిస్ లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు రాజమౌళి. అదీగాక గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఉత్తమ పాట, ఉత్తమ ఫారెన్ లాంగ్వేజ్ పిక్చర్ విభాగాల్లో నామినేట్ అయ్యింది.

    జనవరి 11వ తేదీన గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందిస్తారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ అమెరికా చేరుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సంబరంలో రామ్ చరణ్ పాల్గొంటున్నాడు.

    ఐతే ప్రస్తుతం కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్ లో హాలీవుడ్ దిగ్గజాల సరసన పార్టీలో జాయిన్ అయ్యాడు రామ్ చరణ్.

    ఆర్ఆర్ఆర్

    ఇండియా నుండి ఒకే ఒక్కడు

    లూయిస్ విట్టన్ మ్యాగజైన్ నిర్వహించిన ఈ పార్టీలో హాలీవుడ్ నటులు మిరందా కేర్, మిచెల్లీ మొదలగు వారున్నారు. ఇండియా నుండి రామ్ చరణ్ ఒక్కడే ఈ పార్టీకి అటెండ్ అయ్యారు.

    మొత్తానికి తెలుగు సినిమా ఖ్యాతి గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునే విధంగా చేసే పనిలో ఉంది ఆర్ఆర్ఆర్ చిత్రబృందం. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ పూర్తయితే నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి.

    ఆర్ఆర్ఆర్ పై అందరికీ ఎన్నో ఆశలున్నాయి. సినిమా కళాకారుల కలల అవార్డు ఆస్కార్, ఆర్ఆర్ఆర్ కి వస్తుందని అనుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఆస్కార్ ఓటర్స్ కి ఆర్ఆర్ఆర్ సినిమాను స్పెషన్ స్క్రీనింగ్ వేసారు.

    ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. మరి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకుంటుందో లేదో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం
    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం

    తెలుగు సినిమా

    2022 రివైండ్: తెలుగు తెరకు దిగొచ్చిన బాలీవుడ్ తారలు టాలీవుడ్
    కలవరపెడుతున్న వరుస టాలీవుడ్ నటుల మరణాలు టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే పవన్ కళ్యాణ్
    2022 సంవత్సరాన్ని మంచి సినిమాతో ముగించాలనుకుంటున్నారా? ఈ లిస్ట్ చూడండి టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025