Page Loader
Peddi Glimpse: ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ డైలాగ్.. 'పెద్ది' గ్లింప్స్‌కు అద్భుత స్పందన!

Peddi Glimpse: ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ డైలాగ్.. 'పెద్ది' గ్లింప్స్‌కు అద్భుత స్పందన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ 'పెద్ది' . ఇందులో జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. గ్రామీణ క్రికెట్‌ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. శ్రీ రామనవమి సందర్భంగా చిత్ర బృందం తాజాగా పెద్ది గ్లింప్స్‌(Peddi Glimpse)అనే వీడియోను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో రామ్‌చరణ్‌ మాస్‌ లుక్‌లో అభిమానుల్ని మెస్మరైజ్ చేశారు. వీడియోలో చరణ్‌ చెప్పిన డైలాగ్‌.. ఏదైనా ఈ నేలమీద ఉన్నప్పుడే సేసేయాల! పుడతామా ఏటి మళ్లీ..!_ - ఉత్తరాంధ్ర యాసలో చెప్పడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ గ్లింప్స్ చివర్లో చరణ్‌ కొట్టిన సిక్స్‌ షాట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.