
రష్మిక మందన్న కొత్త సినిమా షురూ: రెయిన్ బో టైటిల్ తో రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కొత్త సినిమాను మొదలెట్టింది. రెయిన్ బో అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు ఈరోజే ప్రకటించింది.
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా రూపొందుతున్న రెయిన్ బో చిత్రంలో మళయాలం నటుడు దేవ్ మోహన్, హీరోగా నటిస్తున్నారు.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ గ్లాస్ హౌస్ లో పూజా కార్యక్రమాలతో ఈరోజే మొదలైంది. ఈ వేడుకకు అక్కినేని అమల, సుప్రియ, సురేష్ బాబు, అల్లు అరవింద్, వెంకీ కుడుముల హాజరయ్యారు.
అక్కినేని అమల క్లాప్ కొట్టగానే లాంఛనంగా సినిమా షూటింగ్ ప్రారంభమైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకే కాలంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో సంతరుబన్, దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రష్మిక మందన్న కొత్త సినిమా ప్రారంభం
Today marks the start of a colourful journey. Join us as we bring the world of #Rainbow to life! 🌟 @iamRashmika @ActorDevMohan @bhaskaran_dop @justin_tunes @thamizh_editor #Banglan @sivadigitalart @Shantharuban87 @prabhu_sr#RainbowFilm #RainbowPooja pic.twitter.com/puANA99qWM
— DreamWarriorPictures (@DreamWarriorpic) April 3, 2023