#VNRtrio: నితిన్ సినిమాకు చిరంజీవి క్లాప్, వెంకీతో సినిమా ఉన్నట్టేనా?
ఈ వార్తాకథనం ఏంటి
హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో రెండవ చిత్రం మొదలైంది. వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన్ భీష్మ ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు.
2020లో వచ్చిన భీష్మ, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. అయితే భీష్మ తర్వాత వెంకీ కుడుముల మరో సినిమాను చేయలేదు.
భీష్మ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు వెంకీ. ఆల్రెడీ ప్రకటన కూడా వచ్చింది. కాకపోతే కథలో మార్పులు చేయమని వెంకీకి చిరంజీవి సూచించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ మార్పులు సెట్ కాకపోవడంతో చిరంజీవితో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని, దాని స్థానంలో VNRtrio మొదలైందని చెబుతున్నారు.
VNRtrio
మెగాస్టార్ క్లాప్ తో మాయమవని ఆశలు
ఈరోజు VNRtrio చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. నితిన్, రష్మికల మీద క్లాప్ కొడుతూ సినిమాను మొదలెట్టారు చిరంజీవి.
వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న సినిమాకు మెగాస్టార్ అతిథిగా రావడంతో, భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అంతకుముందు ఆగిపోయిన సినిమా, మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందనీ, నితిన్, రష్మికలతో సినిమా పూర్తికాగానే, మెగాస్టార్ ను వెంకీ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
మొత్తానికి మూడేళ్ల తర్వాత మళ్ళీ నితిన్, రష్మికలతోనే సినిమా మొదలెట్టాడు వెంకీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.