Irumudi : రవి తేజ-ప్రియా జోడీ ఫిక్స్.. ఆకట్టుకున్న 'ఇరుముడి' పోస్టర్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ హీరోగా, భావోద్వేగాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఇరుముడి' టాలీవుడ్‌లో మంచి చర్చనీయాంశంగా మారింది. మాస్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజ, ఎమోషనల్ కథలను హృదయానికి హత్తుకునేలా చెప్పగల శివ నిర్వాణ మొదటిసారి కలిసి పని చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కోలీవుడ్ నటి ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, రవితేజ పక్కన ఎంతో సహజంగా, ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రియా భవానీ శంకర్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద తెలుగు ప్రాజెక్ట్ కావడం విశేషం.
Details
భారీ స్థాయిలో నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. 'బేబీ' చిత్రంతో గుర్తింపు పొందిన నకాస్త్ర ఈ సినిమాలో రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. తండ్రి-కూతుళ్ల మధ్య సాగే భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని సమాచారం. సంగీతాన్ని జి. వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఇప్పటికే రవితేజ ఈ కథపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ సరైన సమయంలో తనను వెతుక్కుంటూ వచ్చిన కథ ఇదేనని పేర్కొన్నారు. దీంతో 'ఇరుముడి'పై అంచనాలు మరింత పెరిగాయి.