Irumudi Kattu Song: 'ఇరుముడి' ప్రమోషన్స్ షురూ.. రవితేజ మూవీ నుంచి తొలి పాట విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
గత కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్న హీరో రవితేజ ప్రస్తుతం 'ఇరుముడి' చిత్రంలో నటిస్తున్నారు. అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తండ్రి-కూతురు అనుబంధాన్ని ప్రధానంగా చూపించే ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం.. ఇప్పుడు 'ఇరుముడి కట్టు' అనే తొలి పాటను విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది.
వివరాలు
వినసొంపుగా ఈ పాట
అయ్యప్ప స్వామి భక్తులకు 'ఇరుముడి కట్టు' పాట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ చిత్రంలోని గీతానికి సంప్రదాయ పాటలోని కొన్ని సాహిత్య పంక్తులను తీసుకున్నప్పటికీ, స్వరాన్ని మాత్రం కొత్తగా స్వరపరిచారు. అయితే 'స్వామియే అయ్యప్పో.. అయ్యప్పో స్వామియే' అనే లిరిక్స్‌తో పాటు ఆ భాగంలోని ట్యూన్‌ను యథాతథంగా ఉంచారు. కొత్త సంగీత రూపంలోనూ ఈ పాట వినసొంపుగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.