LOADING...
Nora Fatehi: 'సర్కే చునార్' వివాదం.. మహిళా కమిషన్ ఎదుట క్షమాపణ చెప్పిన నోరా ఫతేహి
'సర్కే చునార్' వివాదం.. మహిళా కమిషన్ ఎదుట క్షమాపణ చెప్పిన నోరా ఫతేహి

Nora Fatehi: 'సర్కే చునార్' వివాదం.. మహిళా కమిషన్ ఎదుట క్షమాపణ చెప్పిన నోరా ఫతేహి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి నోరా ఫతేహి 'సర్కే చునార్' పాట వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఎదుట హాజరయ్యారు. ఈ పాటలో మహిళలను అభ్యంతరకరంగా చూపించారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆమె ఢిల్లీలో కమిషన్ ముందు హాజరై రాతపూర్వకంగా క్షమాపణలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నోరా ఫతేహి, ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. "నన్ను ఆ పరిస్థితిలోకి నెట్టారు. ఒక కళాకారిణిగా నా బాధ్యతను నేను అర్థం చేసుకున్నాను. జరిగిన విషయానికి క్షమాపణలు చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదానికి పరిష్కారంగా కొంతమంది అనాథ బాలికల విద్యా బాధ్యతలను స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు నోరా వెల్లడించారు.

వివరాలు

హిందీ వెర్షన్‌పై గతంలో తీవ్ర విమర్శలు

KD డెవిల్ చిత్రంలోని 'సర్కే చునార్' పాట హిందీ వెర్షన్‌పై గతంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదే వివాదానికి సంబంధించి గత నెలలో నటుడు సంజయ్ దత్ కూడా మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పారు. ఆయన కూడా 50 మంది గిరిజన బాలికల విద్యకు సహాయం అందిస్తానని ప్రకటించారు. ఇక తాను ఈ పాట కన్నడ వెర్షన్‌లో మాత్రమే నటించానని, హిందీ వెర్షన్ సాహిత్యం గురించి తనకు తెలియదని నోరా ఇప్పటికే వివరణ ఇచ్చారు. తన అనుమతి లేకుండానే హిందీ వెర్షన్‌ను విడుదల చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మేకర్స్ ఆ పాట హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.

Advertisement