Page Loader
Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్
సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్

Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, ఎన్టీఆర్ బావమరిదిగా సినీ రంగంలో అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు పొందిన నితిన్, ప్రస్తుతం 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో నార్నే నితిన్ సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కమర్షియల్ అంశాలతో యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. చిత్రం జూన్ 6న అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించింది.

Details

జూన్ 6న రిలీజ్

నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, 'యూత్‌ను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలతో బిగ్ హిట్ మూవీని రూపొందించాలన్న లక్ష్యంతో నార్నే నితిన్ - సతీష్ వేగేశ్న కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందించాం. నితిన్ ఇటీవల వరుసగా యూత్‌ఫుల్ హిట్స్ అందుకుంటున్నారు. 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' కథ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎన్టీఆర్ ఈ కథను చదివి ఎంతో మెచ్చినట్టు తెలిపారు. ఆయన అంచనాలకు అనుగుణంగా దర్శకుడు సతీష్ వేగేశ్న ఎక్కడా రాజీపడకుండా అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పారు. జూన్ 6న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, నార్నే నితిన్ ఖాతాలో 'ఆయ్', 'మ్యాడ్' తరహాలో మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.