King: కింగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. షారుక్, దీపికల రొమాన్స్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కింగ్' నుంచి తొలి పాట 'తూ మిల్ జాయే'ను చిత్రబృందం విడుదల చేసింది. షారుఖ్, దీపికా పదుకొణె జంటగా కనిపించిన ఈ పాటలో రొమాన్స్‌తో పాటు యాక్షన్ సినిమా ప్రపంచానికి సంబంధించిన ఆసక్తికరమైన దృశ్యాలు కూడా ఉన్నాయి. నవంబర్ 2న విడుదలైన ఈ పాట ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Details
అర్జిత్ స్వరానికి ఎడ్ షీరన్ ర్యాప్ తోడు
ఈ పాటకు సంగీత దర్శకులు సచిన్-జిగర్ స్వరాలు అందించగా, కుమార్ సాహిత్యం రాశారు.
అర్జిత్ సింగ్, మధుబంతి బాగ్చి ఆలపించారు. అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్ ఇంగ్లిష్ ర్యాప్ ఈ పాటకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పియూష్-షాజియా కొరియోగ్రఫీ అందించారు. భారతీయ సంగీతంతో అంతర్జాతీయ సంగీత శైలిని కలిపి రూపొందించిన ఈ పాటలో కొత్తదనం కనిపిస్తుంది.
Details
దీపికతో షారుఖ్ రొమాంటిక్ కెమిస్ట్రీ
పాట ప్రారంభంలోనే షారుఖ్ చెప్పే డైలాగ్ ఆయన పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత షారుఖ్, దీపిక కలిసి విహారయాత్రలు, కేఫ్ సందర్శనలు, బీచ్‌లో గడిపే అందమైన క్షణాలు కనిపిస్తాయి.
షర్ట్‌లెస్ లుక్‌లో షారుఖ్ కనిపించడం అభిమానులకు మరో సర్‌ప్రైజ్. అయితే పాటంతా ప్రేమకథలా సాగదు. క్రమంగా కథలో చీకటి కోణాలు బయటపడుతూ, ఆయన అక్రమ స్మగ్లింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు సూచించే దృశ్యాలు ఆసక్తిని పెంచుతున్నాయి.
Details
ప్రేమ వెనుక యాక్షన్ కథ.. డిసెంబర్ 24న విడుదల
చివర్లో షారుఖ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
'పఠాన్' తర్వాత షారుఖ్, సిద్ధార్థ్ ఆనంద్ కలిసి పనిచేస్తున్న రెండో సినిమా ఇది. సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లావత్, అభయ్ వర్మ, అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
'కింగ్' ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 24, 2026న థియేటర్లలో విడుదల కానుంది.