Page Loader
Shekhar Kapur: క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు..మంచి అభిరుచి గల నిర్మాత.. విలక్షణ నటుడు శేఖర్‌ కపూర్‌
క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు..మంచి అభిరుచి గల నిర్మాత.. విలక్షణ నటుడు శేఖర్‌ కపూర్‌

Shekhar Kapur: క్లాసిక్‌ చిత్రాల దర్శకుడు..మంచి అభిరుచి గల నిర్మాత.. విలక్షణ నటుడు శేఖర్‌ కపూర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

క్లాసిక్‌ సినిమాలు రూపొందించిన దర్శకుడు, మంచి అభిరుచి గల నిర్మాత, వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన విలక్షణ నటుడు శేఖర్‌ కపూర్‌. ఆయన భారతీయ చిత్ర పరిశ్రమపై సుదీర్ఘ ప్రభావం చూపిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇప్పుడు ఆయనకు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రారంభంలో సహాయ నటుడిగా 'ఇష్క్‌ ఇష్క్‌ ఇష్క్‌', 'ఖంజర్‌', 'అగ్ని పరీక్ష' వంటి చిత్రాలలో చిన్న పాత్రల్లో కనిపించిన ఆయన, 1983లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ 'మసూమ్‌' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి ప్రయత్నంలోనే శేఖర్‌ కపూర్‌ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందారు. తరువాత 1987లో 'మిస్టర్‌ ఇండియా' సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

వివరాలు 

'ఎలిజిబెత్‌' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో  గుర్తింపు

బందిపోటు నాయకురాలిగా, రాజకీయ నేతగా ప్రాచుర్యం పొందిన పూలన్‌ దేవి జీవిత ఆధారంగా రూపొందించిన చిత్రం 'బాండిట్ క్వీన్' 1994లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, ఆ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సహా పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. 'ఎలిజిబెత్‌' సినిమాతో శేఖర్‌ కపూర్‌ అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి గుర్తింపు పొందారు. ఈ సినిమా ఆ సంవత్సరంలో ఏడు అకాడమీ అవార్డులకు నామినేట్‌ అయింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న శేఖర్‌ 2000లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.