
సైమా అవార్డ్స్ 2023: ఆర్ఆర్ఆర్ సినిమాతో సీతారామం పోటీ; ఏకంగా 10నామినేషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
సైమా (SIIMA - సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్) పురస్కారాలకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది.
ప్రతీ ఏడాది దక్షిణ భారత రాష్ట్రాల భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం సినిమాలకు సైమా అవార్డులు అందిస్తుంది.
ఈసారి కూడా అవార్డుల ప్రధానోత్సవానికి సిద్ధమవుతోంది. తాజాగా నామినేషన్స్ బయటకు వచ్చాయి.
తెలుగు:
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి 2023సంవత్సరానికి గాను రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు 11 నామినేషన్లు దక్కాయి. సీతారామం సినిమాకు 10 నామినేషన్లు వచ్చాయి.
ఇక తెలుగులో ఉత్తమ చిత్రం విభాగంలో ఆర్ఆర్ఆర్, సీతారామం, డీజే టిల్లు, కార్తికేయ 2, మేజర్ చిత్రాలు పోటీ పడుతున్నాయి.
Details
తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో నామినేషన్ దక్కించుకున్న సినిమాలు
తమిళం:
తమిళ సినిమా నుండి మణీరత్నం దర్శకత్వంలోని పొన్నియన్ సెల్వన్-1 చిత్రానికి అత్యధిక నామినేషన్లు(10) వచ్చాయి.
ఉత్తమ చిత్రం విభాగంలో పొన్నియన్ సెల్వన్-1, విక్రమ్, లవ్ టుడే, తిరుచిత్రంబలం, రాకెట్రీ-నంబి ఎఫెక్ట్ ఉన్నాయి.
కన్నడ:
శాండల్ వుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే, కాంతారా, కేజీఎఫ్ 2 చిత్రాలు అత్యధికంగా 11నామినేషన్లు అందుకున్నాయి.
ఉత్తమ చిత్రం విభాగంలో కాంతారా, కేజీఎఫ్ 2, 777చార్లీ, లవ్ మాక్ టైల్ 2, విక్రాంత్ రోణ ఉన్నాయి.
మళయాలం:
మమ్ముట్టి నటించిన భీష్మ పర్వతం సినిమాకు అత్యధికంగా 7నామినేషన్లు దక్కాయి.
ఉత్తమ చిత్రం విభాగంలో భీష్మ పర్వతం, తల్లుమాల, హృదయం, జయ జయ జయ జయహే, జనగణమన, నిన తాన్ కేస్ కొడు చిత్రాలు రేసులో ఉన్నాయి.