LOADING...
Singer Kalpana: "నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యదు": కల్పన 
నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు

Singer Kalpana: "నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యదు": కల్పన 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2025
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

గాయని కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పటికీ, ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన భర్తపై మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని కోరుతూ, తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని, అందుకే టాబ్లెట్లు వేసుకున్నానని ఆమె తెలిపారు.

వివరాలు 

ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు: కల్పన

"మా కుటుంబంపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. నేను, నా భర్త, మా కుమార్తె కలిసి సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాను. నా భర్త సహాయ సహకారాల వల్లనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. అందుకే వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నాను. ప్రిస్క్రిప్షన్‌లో ఉన్న టాబ్లెట్లు అప్రమత్తంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, పొరపాటున అధిక మోతాదులో తీసుకున్నాను. దాని వల్ల స్పృహ తప్పి పడిపోయాను.

వివరాలు 

నా భర్త మద్దతు వల్లే..

నా భర్త సమయానికి స్పందించడం, కాలనీవాసులు, పోలీసుల సహకారం వల్లనే నేను ఇప్పుడు మీ ముందున్నాను. త్వరలోనే నా పాటలతో మిమ్మల్ని మళ్లీ అలరిస్తాను. నా అభిరుచికి అనుగుణంగా నేను రాణించగలుగుతున్నది నా భర్త మద్దతు వల్లే. నా జీవితానికి అతనే బెస్ట్ గిఫ్ట్. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు"అంటూ ఆమె వీడియోలో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తప్పుడు ప్రచారం ఆపండి: కల్పన