NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సింగర్ సునీత బర్త్ డే: సింగర్ గా పేరు తెచ్చుకొని డబ్బింగ్ ఆర్టిస్టుగా ఏ ఏ హీరోయిన్లకు గొంతునిచ్చిందో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    సింగర్ సునీత బర్త్ డే: సింగర్ గా పేరు తెచ్చుకొని డబ్బింగ్ ఆర్టిస్టుగా ఏ ఏ హీరోయిన్లకు గొంతునిచ్చిందో తెలుసా? 
    సునీత బర్త్ డే

    సింగర్ సునీత బర్త్ డే: సింగర్ గా పేరు తెచ్చుకొని డబ్బింగ్ ఆర్టిస్టుగా ఏ ఏ హీరోయిన్లకు గొంతునిచ్చిందో తెలుసా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 10, 2023
    11:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సునీత ఉపద్రష్ట.. కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ చిత్రంలోని ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను అనే పాటతో తెలుగు సినిమా సంగీత లోకానికి పరిచయమైంది.

    గులాబీ చిత్రంలోని ఆ పాట ఇప్పటికీ చాలా ఫేమస్. సింగర్ సునీత అనగానే అందరికీ ఆ పాట గుర్తుకొస్తుందంటే ఆ పాట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

    ఈరోజు సునీత బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె కెరీర్ లోని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం.

    సింగర్ గా తెలుగు సహా ఇతర భాషల్లోనూ పాడిన సునీత, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ పనిచేసింది. చాలామంది స్టార్ హీరోయిన్లకు ఆమె గొంతును అందించింది.

    Details

    ఏ ఏ  హీరోయిన్లకు సునీత గొంతును అందించిందంటే 

    ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది జయం సినిమా గురించి. ఇందులో హీరోయిన్ సదాకు సునీత డబ్బింగ్ చెప్పింది. వెళ్ళవయ్యా వెళ్ళు, అనే డైలాగ్ ఎంత పాపులరో మనందరికీ తెలుసు.

    బాస్, సింహ, తులసి సినిమాల్లో నయనతార, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నమో వెంకటేశా చిత్రాల్లో త్రిష, జులాయి, ఆట సినిమాల్లో ఇలియానా పాత్రలకు గాత్ర దానం చేసింది సునీత.

    ఇంకా శ్రియ, మీరాజాస్మిన్, ప్రియమణి, తమన్నాలకు చాలా సినిమాల్లో డబ్బింగ్ చెప్పింది.

    ఇక సునీత వ్యక్తిగత విషయాలకు వస్తే, ఆమెకు తన 19వ ఏట కుమార్ గోపరాజుతో వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం రామకృష్ణ వీరపనేని అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది సునీత.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్

    తెలుగు సినిమా

    సిటడెల్ షూటింగ్ కష్టాలు: మంచుగడ్డల్లో టార్చర్ అనుభవిస్తున్న సమంత  సమంత
    గుడి కడతానన్న అభిమానికి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ డింపుల్ హయాతి, షాక్ అవుతున్న నెటిజన్లు సినిమా రిలీజ్
    గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్  వరుణ్ తేజ్
    తంగలాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విక్రమ్, నిలిచిపోయిన షూటింగ్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025