NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సర్కార్ నౌకరి: హీరోగా మారుతున్న సింగర్ సునీత కొడుకు
    తదుపరి వార్తా కథనం
    సర్కార్ నౌకరి: హీరోగా మారుతున్న సింగర్ సునీత కొడుకు
    సర్కారు నౌకరి సినిమాతో హీరోగా మారుతున్న సునీత కొడుకు

    సర్కార్ నౌకరి: హీరోగా మారుతున్న సింగర్ సునీత కొడుకు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 27, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. వరుసపెట్టి సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబాల నుండి వారసులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఒక్కో కుటుంబం నుండి ఎక్కువ మొత్తంలో వారసులు ఉన్నారు.

    బాలీవుడ్, టాలీవుడ్ ఎక్కడైనా వారసుల ఆధిక్యం ఎక్కువగానే ఉంది. తాజాగా సింగర్ సునీత, తన కొడుకుని తెలుగు సినిమాల్లోకి తీసుకువస్తుంది.

    సింగర్ సునీత కొడుకు ఆకాష్, "సర్కార్ నౌకరి" అనే సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగుపెడుతున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది.

    పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక, సునీత భర్త రామ్ వీరపనేని, మొదటి షాట్ కి దర్శకత్వం వహించగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మొదటి క్లాప్ కొట్టారు.

    తెలుగు సినిమా

    రాఘవేంద్ర రావు నిర్మాతగా తెరకెక్కుతున్న సర్కారు నౌకరి

    సర్కార్ నౌకరి సినిమాలో ఆకాష్ సరసన భావన వజపండల్ అనే కొత్తమ్మాయి తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 6వ తేదీ నుండి మొదలవనుందని సమాచారం.

    ఆర్ కే టెలిఫిలిమ్ షో బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగమౌని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.

    ఆకాష్, భావన, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మిగతా ముఖ్యమైన పాత్రల్లో ఎవరు చేస్తున్నారో వెల్లడి చేయలేదు. అలాగే సంగీతం ఎవరు చేస్తున్నారనేది ప్రకటించలేదు.

    మరి సునీత కొడుకు ఆకాష్, సర్కారు నౌకరి సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి. అలాగే ఎంతో మంది వారసుల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంటాడో లేదో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    తెలుగు సినిమా

    ఆర్ఆర్ఆర్: హాలీవుడ్ దిగ్గజాల సరసన రామ్ చరణ్, ఆ పార్టీకి ఇండియా నుండి ఒకే ఒక్కడు సినిమా
    ధమాకా దర్శకుడికి అదిరిపోయే అవకాశం, ఈ సారి ఏకంగా స్టార్ హీరోతో అవకాశం సినిమా
    శాకుంతలం ట్రైలర్ రిలీజ్: గుణశేఖర్ మాటలకు ఏడ్చేసిన సమంత సమంత రుతు ప్రభు
    వీరసింహారెడ్డి సెన్సార్ రిపోర్ట్: యాక్షన్ తో మేళవించిన ఎమోషన్ వీరసింహారెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025