Page Loader
స్కంద ప్రీ రిలీజ్ థండర్ కు థమన్ మరింత హైప్.. 'రాపో' కాదు 'ర్యాంపో'  
స్కంద ప్రీ రిలీజ్ థండర్ కు థమన్ మరింత హైప్.. 'రాపో' కాదు 'ర్యాంపో'

స్కంద ప్రీ రిలీజ్ థండర్ కు థమన్ మరింత హైప్.. 'రాపో' కాదు 'ర్యాంపో'  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2023
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ థండర్ పేరుతో ఆగస్టు 26వ తేదీన స్కంద ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ విషయమై స్కంద మూవీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోష‌ల్ మీడియాలో తాజాగా ఓ పోస్టు పెట్టాడు. ఈ రోజు వచ్చే స్కంద ట్రైలర్ అదరగొడుతుందని రాసుకొచ్చాడు. ఈ రోజు జరిగే ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ అతిధిగా రాబోతున్నారు. రిలీజ్ కానున్న ఈ ట్రైలర్‌పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్నసినిమా, పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు,తమిళం,కన్నడ,మళయాలం,హిందీ భాషల్లో విడుదలవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోష‌ల్ మీడియాలో స్కంద సినిమా పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పోస్ట్