Sreeleela - Lenin: సంబంధం లేకున్నా శ్రీలీలపై ట్రోల్స్.. 'లెనిన్' సక్సెస్‌తో మళ్లీ చర్చల్లోకి హీరోయిన్
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా ద్వారా ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు కొంతమంది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మొత్తంగా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ విజయంతో అఖిల్‌తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా భావోద్వేగానికి గురయ్యారు. వీరికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో హీరోయిన్ శ్రీలీల పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
వివరాలు
నెట్టంట ట్రోల్స్ వైరల్..
శ్రీలీలపై నెటిజన్లు విమర్శలు చేయడానికి కూడా ఓ ప్రత్యేక కారణం కనిపిస్తోంది. 'లెనిన్' సినిమాను ప్రకటించిన సమయంలో విడుదల చేసిన ప్రచార వీడియోలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలనే ఎంపిక చేసినట్లు సంకేతాలు కనిపించాయి. అయితే తర్వాత ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. సినిమాలో భాగ్యశ్రీ తన నటనతో పాటు గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో, అదే పాత్రలో శ్రీలీల నటించి ఉంటే ఈ స్థాయి ప్రభావం చూపించలేకపోయేదని, సినిమాకు అది ప్రతికూలంగా మారేదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
వివరాలు
మరోసారి ఆమెను టార్గెట్..
నిజంగా శ్రీలీల 'లెనిన్' సినిమాలో నటించి ఉంటే ఫలితం ఎలా ఉండేదనేది చెప్పలేని విషయమే. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెపై విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో శ్రీలీల తెలుగులో అనేక సినిమాల్లో నటించినప్పటికీ, 'ధమాకా' మినహా మిగతా చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అలాగే ఆమె ఎక్కువగా ఒకే తరహా పాత్రలను ఎంచుకుంటోందనే విమర్శలు కూడా గతంలో వినిపించాయి. ఇప్పుడు 'లెనిన్' సినిమా విజయాన్ని ప్రస్తావిస్తూ మరోసారి ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
వివరాలు
మరోసారి వార్తల్లోకి శ్రీలీల..
ఈ ఏడాది విడుదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల చివరిసారిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించింది. అయితే ఆ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె హిందీలో ఒక సినిమా, తమిళంలో మరో ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. తెలుగులో కొత్త సినిమాలు ప్రకటించకపోయినా, 'లెనిన్' సినిమా విజయంతో ప్రారంభమైన చర్చల కారణంగా శ్రీలీల మరోసారి వార్తల్లో నిలిచింది.