LOADING...
Iran: హోర్ముజ్ జలసంధి మూసివేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు కఠిన హెచ్చరిక
హోర్ముజ్ జలసంధి మూసివేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు కఠిన హెచ్చరిక

Iran: హోర్ముజ్ జలసంధి మూసివేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు కఠిన హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 12, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం విఫలం కావడంతో హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. తమ అనుమతి లేకుండా ప్రయాణించే నౌకలను అడ్డుకుంటూ చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, కేష్మ్ ద్వీప ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది.

వివరాలు 

ఇరాన్ నిర్ణయంపై అమెరికా తీవ్ర అభ్యంతరం

అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఐఆర్‌జీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. తమ అనుమతి లేని మార్గాల ద్వారా వచ్చే ఏ వాణిజ్య నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ నిర్ణయంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, ఇకపై నౌకలపై దాడులు చేయబోమని 24 గంటల్లో అధికారికంగా ప్రకటించాలని ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలిపింది.

Advertisement