LOADING...
Wimbledon Final: వింబుల్డన్‌ విజేతగా నోస్కోవా
వింబుల్డన్‌ విజేతగా నోస్కోవా

Wimbledon Final: వింబుల్డన్‌ విజేతగా నోస్కోవా

వ్రాసిన వారు Moogati Shabari
Jul 12, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

చెకియా యువ టెన్నిస్‌ స్టార్‌ లిండా నోస్కోవా వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. శనివారం రెండు గంటలకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో తొమ్మిదో సీడ్‌ నోస్కోవా 6-2, 5-7, 6-3 స్కోరుతో పదో సీడ్‌ కరోలినా ముచోవా (చెకియా)పై విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే నోస్కోవా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బలమైన సర్వీసులు, అద్భుతమైన క్రాస్‌కోర్టు షాట్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచిన ఆమె తొలి సెట్లో నాలుగో గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ తొలి సెట్‌ను సునాయాసంగా 6-2తో ముగించింది.

వివరాలు

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్..

రెండో సెట్‌లో మాత్రం మ్యాచ్‌ పూర్తిగా ఉత్కంఠభరితంగా మారింది. 5-2తో ముందంజలో నిలిచిన నోస్కోవా టైటిల్‌కు కేవలం ఒక అడుగు దూరంలో కనిపించింది. అయితే ఓటమి అంచుల వరకు వెళ్లిన ముచోవా అసాధారణంగా పుంజుకుని వరుసగా ఐదు గేమ్‌లు గెలిచింది. దీంతో రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది.

వివరాలు

ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు..

మూడో సెట్‌లో మరోసారి నోస్కోవా తన దూకుడును ప్రదర్శించింది. రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె వెంటనే 3-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఆ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకుంటూ సెట్‌తో పాటు వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది. ఈ ఫైనల్లో నోస్కోవా మొత్తం 10 ఏస్‌లు నమోదు చేయడంతో పాటు 44 విన్నర్‌ షాట్లు ఆడి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2011లో 21 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ విజేతగా నిలిచిన పెట్రా క్విటోవా తర్వాత, అదే వయసులో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నోస్కోవా చరిత్ర సృష్టించింది.

Advertisement