LOADING...
Sree Vishnu : ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Sree Vishnu : ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు మూవీ.. ఎక్కడ చూడాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2026
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు వరుసగా కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన, నయన్ సారిక జంటగా నటించిన 'విష్ణు విన్యాసం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మాణంలో, యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో వాస్తు, జాతకాలను గట్టిగా నమ్మే వ్యక్తి పాత్రలో శ్రీవిష్ణు కనిపించి తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌తో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్‌లో ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను మెప్పించాయి.

Details

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో దాదాపు రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. 'విష్ణు విన్యాసం' చిత్రం మార్చి 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇది కేవలం తెలుగులోనే అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం పొందుతున్నారు.

Advertisement