NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ తో సందడి చేస్తున్న సుధీర్ బాబు
    సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ తో సందడి చేస్తున్న సుధీర్ బాబు
    సినిమా

    సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ తో సందడి చేస్తున్న సుధీర్ బాబు

    వ్రాసిన వారు Sriram Pranateja
    March 01, 2023 | 03:35 pm 0 నిమి చదవండి
    సిక్స్ ప్యాక్ పోయి ఫ్యామిలీ ప్యాక్ తో సందడి చేస్తున్న సుధీర్ బాబు
    మామా మశ్చీంద్ర మూవీలో సుధీర్ బాబు

    పాత్ర కోసం బరువు తగ్గడం, బరువు పెరగడం, సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ చేయడం మామూలే. పాత్రలో ఒదిగిపోవడానికి హీరోలు రకరకాలుగా కష్టపడుతుంటారు. ఆ కష్టంతో వివిధ రూపాల్లో వెండితెర మీద దర్శనమిస్తుంటారు. ఐతే చాలా కొన్నిసార్లు మాత్రమే కొన్ని రూపాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అరే, వీళ్ళేంటి ఇలా మారిపోయారని అనిపిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి సందర్భమే సుధీర్ బాబు విషయంలో వచ్చింది. అవును, మొన్నటికి మొన్న హంట్ మూవీతో వచ్చి డిజాస్టర్ అందుకున్న సుధీర్ బాబు ఈసారి సరికొత్త రూపంలో కనిపించబోతున్నాడు. ఫిట్ నెస్ కి కేరాఫ్ గా సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ లో కనిపించే సుధీర్ బాబు, ఈసారి పొట్టతో ఫ్యామిలీ ప్యాక్ తో కనిపిస్తున్నాడు.

    మామా మశ్చీంద్ర మూవీతో సుధీర్ బాబు సరికొత్త ప్రయోగం

    మామా మశ్చీంద్ర పేరుతో మూవీ తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో.. లావుగా కనిపించాడు సుధీర్ బాబు. జీపు మీద కూర్చుని మెడలో వేలాడుతున్న గొళుసును నోట్లో పెట్టుకుని, పెద్ద జుట్టుతో ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే పైల్వాన్ మాదిరిగా ఉన్నాడు సుధీర్ బాబు. ఇందులో సుధీర్ బాబు పాత్ర పేరు దుర్గ అని పరిచయం చేసారు. శ్రీ వెంకటేశ్వర్ సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న మామా మశ్చీంద్ర మూవీని హర్షవర్ధన్ తెరకెక్కిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, కెమెరా బాధ్యతలు పీజీ విందా నిర్వర్తిస్తున్నారు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    మామా మశ్చీంద్ర మూవీలో సుధీర్ బాబు

    Bet you didn't see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie

    — Sudheer Babu (@isudheerbabu) March 1, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    సామజవరగమన గ్లింప్స్: ప్రపంచంలో ఏ ప్రేమకీ లేని ప్రాబ్లమ్ తో కొత్తగా వస్తున్న శ్రీ విష్ణు టీజర్
    రేపు విడుదల కానున్న సామజవరగమన ఫస్ట్ లుక్ సినిమా
    దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత సినిమా
    'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది సినిమా
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023