
ఈ వారంలో ఓటీటీ లేదా థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారంలో థియేటర్ల దగ్గర సినిమాల సందడిఎక్కువగా ఉండనుంది. మహాశివరాత్రి సందర్భంగా మంచి మంచి సినిమాలు థియేటర్లలో కనిపించనున్నాయి. ఓటీటీల్లోనూ ఈ వారం కంటెంట్ విడుదలవుతోంది.
సార్: హీరో ధనుష్ నటించిన మొట్టమొదటి తెలుగు చిత్రం సార్. సంయుక్తా మీనన హీరోయిన్ గా కనిపించిన సార్ సినిమాను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసారు. ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళం భాషల్లో విడుదల అవుతుంది.
వినరో భాగ్యము విష్ణుకథ: కిరణ్ అబ్బవరం, కశ్మీరీ పరదేసి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, ఫోన్ నంబర్ నైబర్ కానెప్ట్ తో ఫిబ్రవరి 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జీఏ 2పిక్చర్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకు బన్నీవాసు నిర్మాతగా ఉన్నారు.
ఓటీటీ
ఈ వారంలో ఓటీటీ, థియేటర్లలో కనిపించే సినిమాలు
షెహజాదా: అలవైకుంఠపురములో హిందీ రీమేక్, షెషజాదా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుంది. కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా కనిపించారు.
గాలోడు: సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన గాలోడు బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఆహా, నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ లలో 17వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా వచ్చిన లక్కీ లక్ష్మణ్ కూడా ఆహాలో 17వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతాయి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 15వ తేదీన మాలికాపురం, 16వ తేదీన సదా నన్ను నడిపే చిత్రాలు రిలీజ్ అవుతుండగా, 17వ తేదీన ది నైట్ మేనేజర్ (హిందీ) రిలీజ్ అవుతుంది.