
సార్ ట్రైలర్: మర్యాద సంపాదించాలంటే చదువు కావాలంటున్న ధనుష్
ఈ వార్తాకథనం ఏంటి
తమిళంలో స్టార్ హీరో అయిన ధనుష్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ధనుష్ చేసే సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందని అందరూ నమ్ముతుంటారు. మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా సినిమాలు తీసే ధనుష్, ప్రస్తుతం సార్ అంటూ తెలుగు సినిమాతో వస్తున్నాడు.
ధనుష్ తొలిసారిగా తెలుగులో నటించిన చిత్రం సార్. ఇది ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళంలో ఏకకాలంలో రూపొందింది. మిస్టర్ మజ్ను, తొలిప్రేమ, రంగ్ దే చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి, తన పాత పంథాను వదిలేసి కొత్తగా దర్శకత్వం వహించిన సినిమా.
సార్ సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే మాష్టారుగా ధనుష్ చాలా కొత్తగా ఉన్నాడు. ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తున్న మోసాలను ఇందులో చూపించనున్నారని తెలుస్తోంది.
ట్రైలర్ టాక్
డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, మర్యాద కావాలంటే చదువు కావాలి
అంతేకాదు సార్ సినిమాలో మంచి ప్రేమకథ ఉన్నట్లుగా అర్థమవుతోంది. బయాలజీ టీచర్ గా సంయుక్త మీనన్ అందంగా ఉంది. హైపర్ ఆది ఉన్నాడు కాబట్టి హాస్యానికి ఢోకా లేదని తెలుస్తోంది.
డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, మర్యాద కావాలంటే చదువు కావాలనే డైలాగ్ బాగుంది. యాక్షన్, లవ్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ ఉన్న పర్ఫెక్ట్ ట్రైలర్ గా కనిపిస్తోంది.
విలన్ గా సముద్రఖని కనిపించాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రేమకథలను వదిలేసిన్, కొత్తరకమైన సినిమాతో వస్తుండడం సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతోంది.
సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించాడు. ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ధనుష్ నటించిన సార్ మూవీ ట్రైలర్ విడుదల
Our #SIR arrives in style 😎
— Sithara Entertainments (@SitharaEnts) February 9, 2023
2M views counting for our #SIRMovieTrailer 🔥
▶️ https://t.co/qBXeazNnB1 @dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @adityamusic @SitharaEnts @Fortune4Cinemas #SIRMovie #SIRMovieOn17Feb pic.twitter.com/DVT7vMZKUR