వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ లాంచ్ అయ్యింది. 2:25నిమిషాల ట్రైలర్ లో కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అంశాలన్నీ కనిపించాయి. యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్నింటినీ ట్రైలర్ లో చూపించారు. అదీగాక ఫోన్ నంబర్ నైబర్ అంటూ కొత్త కాన్సెప్ట్ ఈ ట్రైలర్ లో కనిపించింది. కిరణ్ అబ్బవరం పాత్రకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తుంది. ఎవరు కాల్ చేసారని హీరో అడిగితే మీ ఫోన్ నంబర్ నైబర్నని హీరోయిన్ చెప్పడం, ఆ తర్వాత ఆ హీరోయిన్ ని హీరో కలిసినట్లు చూపించారు. ఇదే ప్రాసెస్ లో మురళీకృష్ణ పాత్ర కూడా ఫోన్ నంబర్ నైబర్ గా హీరోయిన్ ని కలుస్తుంది.
విభిన్నంగా కనిపిస్తున్న మురళీకృష్ణ
హీరో, హీరోయిన్, మురళీకృష్ణ పాత్రల మధ్య వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్వించేలా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది మురళీకృష్ణ అని చెప్పవచ్చు. ఈ మధ్య ఇన్స్టా రీల్స్ లో పాపులర్ అయిన కొన్ని పాటలకు మురళీకృష్ణ డాన్స్ వేయడం చూస్తుంటే, ఈ సినిమాలో కామెడీకి కొదవ లేదని తెలుస్తోంది. గత సినిమాల్లో కంటే ఈ ట్రైలర్ లో కిరణ్ అబ్బవరం బాగా కనిపించాడు. సినిమాలోనూ అదే విధంగా ఉంటుందేమో చూడాలి. జీఏ2 సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో కశ్మీర్ పరదేశి, హీరోయిన్ గా కనిపిస్తోంది. ఆమని, మురళీకృష్ణ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.