
Taraka Rama Rao: నందమూరి వారసుడిగా తారక రామారావు అరంగేట్రం.. ఘనంగా ప్రారంభమైన తొలి సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా నటించనున్న తాజా చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఈ ప్రారంభోత్సవానికి నందమూరి ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాను వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.
న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తారక రామారావుకు జోడీగా తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
వీరిద్దరినీ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు డైరెక్టర్ వై.వి.ఎస్. చౌదరి. నారా భువనేశ్వరి హీరో-హీరోయిన్లపై క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించారు.
Details
శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్వరి, పురంధేశ్వరి
ఈ సందర్భంగా ఆమెతో పాటు లోకేశ్వరి, పురంధేశ్వరి తదితర కుటుంబ సభ్యులు మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం కథా నేపథ్యం 1980 కాలం నాటిదిగా ఉంటుందని సమాచారం.
తెలుగు భాష, హైందవ సంస్కృతి విశిష్టతను ఈ చిత్రంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ సినిమా బలంగా నిలిచే అంశం దాని నేపథ్యమేనని దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి తెలిపారు.
సినిమాల బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా ప్రేక్షకుల మనసులు గెలవాలంటే నిపుణత, కృషి అవసరం.
అలాంటి ప్రయాస తారక రామారావు నుంచి ఎంత మేర ఎదురవుతుందో, ఆయన తనదైన గుర్తింపును ఎలా సంపాదించుకుంటారో వేచి చూడాల్సిందే.