
ఈ వారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ వారం బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాల సందడి ఎక్కువగా ఉండనుంది. ఏయే సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయడానికి వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
LGM:
అంతర్జాతీయ క్రికెట్ కు విశ్రాంతి ప్రకటించిన ధోనీ, సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి LGM అనే సినిమాను తెరకెక్కించారు.
హరీష్ కళ్యాణ్, ఇవానా నటించిన ఈ సినిమా, ఆగస్టు 4వ తేదీన తెలుగు, తమిళం భాషల్లో థియేటర్లలోకి వస్తుంది.
విక్రమ్ రాథోడ్:
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ హీరోగా కనిపిస్తున్నారు. సోనూసూద్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 4న విడుదల అవుతుంది.
Details
ఓటీటీలోకి వచ్చేస్తున్న దయా సిరీస్
రాజుగారి కోడి పులావ్:
కుటుంబ కథా విచిత్రం అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో, ప్రభాకర్, శివకోన, రమ్య దేశ్, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. శివకోన దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 4న రిలీజ్ అవుతుంది.
ఓటీటీలో ఆగస్టు 4న రిలీజ్ అవుతున్న సినిమాలు:
నాగశౌర్య నటించిన రంగబలి - నెట్ ఫ్లిక్స్
మసూద ఫేమ్ తిరువీర్ నటించిన పరేషాన్ - సోనీ లివ్
ఫాహద్ ఫాజిల్ హీరోగా వచ్చిన ధూమం సినిమా - అమెజాన్ ప్రైమ్ జేడీ చక్రవరి ప్రధాన పాత్రలో రూపొందిన దయా సిరీస్, అగస్టు 5నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.