Loading...
Maremma: పల్లెటూరి నేపథ్యంలో యాక్షన్,సస్పెన్స్.. ఓటీటీ స్క్రీన్ పైకి సస్పెన్స్ థ్రిల్లర్ 'మారెమ్మ'
ఓటీటీ స్క్రీన్ పైకి సస్పెన్స్ థ్రిల్లర్ 'మారెమ్మ'

Maremma: పల్లెటూరి నేపథ్యంలో యాక్షన్,సస్పెన్స్.. ఓటీటీ స్క్రీన్ పైకి సస్పెన్స్ థ్రిల్లర్ 'మారెమ్మ'

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో తెలుగు సినిమా సిద్ధమైంది. పల్లెటూరి వాతావరణం, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'మారెమ్మ' ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ చిత్రానికి మంచాల నాగరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆయనకు జోడీగా 'హార్ట్ బీట్' ఫేమ్ దీపాబాలు కథానాయికగా నటించింది. 'హార్ట్ బీట్' సిరీస్ ద్వారా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ దీపాబాలు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్ తర్వాత ఆమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తాయని భావించినట్టుగానే 'మారెమ్మ'లో హీరోయిన్‌గా కనిపించింది.

వివరాలు 

సెప్టెంబర్ 9న థియేటర్లలో 'మారెమ్మ'

'మారెమ్మ' సెప్టెంబర్ 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.

ఈ నెల 9వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కథ విషయానికి వస్తే.. ఒక అందమైన పల్లెటూరిలో గ్రామస్థులంతా 'మారెమ్మ' తల్లిని తమ ఇలవేల్పుగా కొలుస్తుంటారు. ఆ అమ్మవారికి సమర్పించిన దున్నపోతు 'మారి'ని గ్రామానికి చెందిన కర్ణి సంరక్షిస్తూ ఉంటాడు.

వివరాలు 

ఆ దున్నపోతు ఏమైంది?

అయితే ఓ రోజు అనూహ్యంగా 'మారి' కనిపించకుండా పోతుంది.

అసలు ఆ దున్నపోతు ఏమైంది? అది అదృశ్యం కావడానికి కారణమేంటి? దానిని వెతికే క్రమంలో కర్ణికి ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు ఏంటి? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది.

ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందించారు. థియేటర్లలో విడుదలైన 'మారెమ్మ' ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT