
Thammudu : 'తమ్ముడు' డబ్బింగ్ పనులు పూర్తి.. రిలీజ్‌కు రెడీగా నితిన్
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'తమ్ముడు' పట్ల భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ సంబంధాల భావోద్వేగాలను మేళవించిన కథాకథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 4న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నితిన్ పాత్ర పేరు 'జై', కాగా తాజాగా ఆయన తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తిచేశారు. దీంతో నితిన్ షూటింగ్‌కు సంబంధించిన భాగం మొత్తం పూర్తి కావడంతో చిత్ర నిర్మాణంలో ఇది కీలకమైన మైలురాయిగా నిలిచింది.
Details
రీ ఎంట్రీ ఇస్తున్న లయ
ఈ చిత్రంలో ఓ ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే శ్రోతల్లో విశేష స్పందనను రాబట్టింది. కాగా, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లపై దృష్టిసారించింది. ట్రైలర్, పాటల విడుదలతో పాటు పలు మీడియా ఈవెంట్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్లో సినిమా పట్ల మంచి ఆసక్తి నెలకొనడంతో 'తమ్ముడు' నితిన్‌కు మరో హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం బలపడుతోంది.